మీ తెల్ల జుట్టుని కవర్ చేయడానికి సహజమైన ఇంటి చిట్కాలు

Back to All Articles
grey hair

మీ తెల్ల జుట్టుని కవర్ చేయడానికి సహజమైన ఇంటి చిట్కాలు

జుట్టు ఫోలికల్చుట్టూ ఉండే మెలనోసైట్స్తగ్గినపుడు లేదా మెలనిన్ యొక్క ఉత్పత్తి నిలిచినప్పుడు తెల్ల రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లబడటం అనేది ఒక వ్యక్తికి నిజంగానే అత్యంత వినాశకరమైన పీడకల. జుట్టు ఫోలికల్ చుట్టూ ఉన్న మెలనోసైట్స్ తగ్గుదల లేదా మెలనిన్ ఉత్పత్తి ఆగినప్పుడు జుట్టు తెల్లబడుతుంది. కేరాటిన్ జుట్టును పెంచే ప్రధాన ప్రోటీన్. కెరాటిన్ లో మెలనిన్ లేకపోవడం లేదా లోపం వల్ల జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.  మెలనిన్ లోపంఅనేదిజెనెటిక్స్, వయస్సు మరియు శరీరంలోని హార్మోన్ల మార్పుల వలన సంభవించవచ్చు. జుట్టును నల్లబడటానికి మరియు జుట్టు మెరిసేందుకుకెమికల్ రంగులు దీర్ఘకాలంవాడడం వల్ల హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి, ఈ ఆర్టికల్లో, తెల్ల జుట్టునినల్లగా మారుటకు సహాయపడే కొన్ని సహజ చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం.

  1. బ్లాక్ టీ

మీ తెల్ల జుట్టుకు నల్ల టీ రాసినట్లయితే క్రమంగా జుట్టును నల్లగా మారుతుంది. ఇది జుట్టు పరిమాణం పెరిగేలా సహాయపడుతుంది మరియు జుట్టు మెరిసేలా చేస్తుంది. వారానికి రెండుసార్లు బ్లాక్ టీ మాస్క్ని వాడండి మరియు దాని తరువాత మంచి ఫలితాల కోసం షాంపూని ఉపయోగించకూడదు. బ్లాక్ టీతెల్ల జుట్టుని నల్లగా మార్చడంలోసహాయపడుతుంది.

  1. కొబ్బరి నూనె మరియు నిమ్మకాయ

కొబ్బరి నూనె మరియు నిమ్మకాయ రెండూ  జుట్టుకు అవసరమైన పదార్థాలు. అవి జుట్టుఫోలికల్స్ లోని పిగ్మెంట్ కణాలను కాపాడడానికి మరియు రోజురోజుకు జుట్టు నలుపు రంగులో ఉంచడంలో సహాయపడతాయి. మీరు కొబ్బరి నూనె మరియు నిమ్మరసంమిశ్రమాన్ని మీ జుట్టుకు వారానికి రెండుసార్లు పెడితే మంచి ఫలితాలుంటాయని సూచించబడింది.

  1. ఉసిరి

ఉసిరి జుట్టుకు ఎంతో లాభకరం మరియు మీరు దీనిని డై పేస్ట్ గా ఉపయోగించినప్పుడు మరింత ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది. మీరు ఉసిరి రసాన్ని హన్నాతో కలిపి, జుట్టు మీద రాసుకోవచ్చు.  ఉసిరి జుట్టుకావలసిన బలాన్నిఇస్తుంది మరియు స్కాల్ప్ కోల్పోయిన తేమనితిరిగి అందించేలా సహాయపడుతుంది. హెన్నా యొక్క యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు స్కాల్ప్ యొక్క pH స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఉసిరి మరియు గోరింటల కలయిక బహుశా తెల్ల జుట్టుని తగ్గించడంలో ఉత్తమఇంటి చిట్కాగా చెప్పవచ్చు. మంచి ఫలితాలు కోసం నెలకుఒకసారి ప్యాక్నిఉపయోగింఛండి.

  1. బంగాళాదుంపలు

ఇంట్లో మీరు సులభంగా బంగాళాదుంపతో మాస్క్ తయారు చేసుకోవచ్చు, ఇది మీ జుట్టును క్రమంగా, సమర్థవంతంగా నల్లగా చేస్తుంది. మీరు చేయాల్సింది ఏమంటే, ఒక బంగాళాదుంపను, గంజి వంటి పదార్ధం తయారవడం మొదలయ్యే వరకు ఉడికించాలి. అప్పుడు బంగాళాదుంప పీల్స్ నుండి వడకట్టిన ద్రవంని వాడండి మరియు మీ జుట్టుకు రాసుకోండి. నీటితో శుభ్రం చేయండి. బంగాళాదుంప స్టార్చ్ ద్రావణం జుట్టు రంగుని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది మరియు తెల్ల జుట్టుని నిరోధిస్తుంది.

  1. బీరకాయ

బీరకాయకూడా తలపై జుట్టు రంగునిపునరుద్ధరించడంలో సహాయపడుతుంది మరియు సహజంగా తెల్లని జుట్టుని నల్లగా చేయడంలో సహాయపడుతుంది. మీరు బీరకాయలని ఉడికించి,కొబ్బరి నూనె కలిపి చల్లగా అయ్యాక జుట్టుకు రాయండి. ఈ ప్యాక్ జుట్టు కుదుళ్ళు బలంగా చేయడంలో సహాయపడుతుంది. మంచి ఫలితాలు కోసం ఈ ప్యాక్ ని వారానికి రెండు నుండి మూడు సార్లు రాసుకోండి.

  1. వోట్స్

వోట్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినవి, అయితే తెల్ల జుట్టుని నలుపు రంగులోకి మార్చగలవని మీకు తెలుసా? మీరు ప్రతీ రోజు అల్పాహారంగా వోట్స్నితినచ్చు లేదా బాదం నూనెని కలిపి దాన్ని పేస్ట్గాచేసుకుని తలకి రాసుకోవచ్చు. వోట్స్ లో బయోటిన్ ఉండటం వల్ల తెల్ల జుట్టుకు మంచి హీలేర్ గా నిరూపించబడింది. బయోటిన్ జుట్టునినల్లగా మారుస్తుంది మరియు లోతుగా పోషణనిస్తుంది. వోట్స్ పేస్ట్ ని కూడా సహజ కండీషనర్ గా ఉపయోగించవచ్చు. మేము వారానికి ఒకసారి ఈ పేస్ట్ ను ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నాము.

7.ఉల్లి రసం

ఉల్లిరసంలో కాటలాస్ సమృద్ధిగా ఉన్నట్లు కనుగొనబడింది, కుదుళ్ళ నుండి జుట్టును నల్లగా మార్చటానికిఒక ఎంజైమ్ బాధ్యతవహిస్తుంది. ఉల్లి రసం బయోటిన్, మెగ్నీషియం, రాగి, విటమిన్ సి, భాస్వరం, సల్ఫర్, విటమిన్స్ B1 మరియు B6 మరియు ఫోలేట్ లకు మంచి మూలం. జుట్టు నల్లబడటం లో మరియు జుట్టు రాలిపోకుండా నివారించడంలో సహాయపడుతుంది. ఉల్లిరసంప్యాక్ చేయడానికి, మీరు చేయాల్సిందల్లా, ఉల్లిపాయ నుండి రసం తీయడం మరియు జుట్టు పై,ముఖ్యంగా కుదుళ్ళపై రాసుకోవడం. 40 నిముషాల పాటు ప్యాక్నివదిలివేసి తర్వాత దానిని శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ ద్వారా సమర్థవంతమైన ఫలితాలు కోసం వారానికి రెండుసార్లు రాసుకోవచ్చు.

From a pimple to cancer, our You Care Wellness Program helps you find a way


Talk to our integrative team of experts today 


18001020253 

info@lukecoutinho.com 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to All Articles